ముంబై లో AA 23 లుక్ టెస్ట్

Icon Star concentrating on AA23Icon Star concentrating on AA23


అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా షూటింగ్ నిమిత్తం ముంబై లోనే ఉన్నారు. నిన్న సోమవారం నాంపల్లి కోర్టుకు కూడా ఆయన హాజరవలేదు. సంధ్య థియేటర్ కేసులో A 11 గా ఉన్న అల్లు అర్జున్ ని నిన్న కోర్టులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని నాంపల్లి కోర్టు నోటీసులు ఇవ్వగా అల్లు అర్జున్ వర్చువల్ గా, ఆయన తరపు న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.

ఇక అట్లీ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న రాకా చిత్రం షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకుండానే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారనే వార్త వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ AA 23 ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చెయ్యబోతున్నారు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే వార్తలొచ్చినా అవి రూమర్స్ అని తేలిపోయింది.

జూన్ 25 న ముంబై లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ పై లుక్ టెస్ట్ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ లుక్ టెస్ట్ తర్వాత లుక్ ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఈ ఏడాది డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈలోపే అల్లు అర్జున్-అట్లీ రాకా షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది అని తెలుస్తుంది.

Allu Arjun game for AA23