ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan Popcorn Price Comment Ignites Theatre Cost Debate

చ‌ర‌ణ్ `పాప్ కార్న్` కామెంట్..దావాన‌లంలా!

Ram Charan Popcorn Price Comment Ignites Theatre Cost DebateRam Charan Popcorn Price Comment Ignites Theatre Cost Debate

ప్ర‌జలు థియేట‌ర్ల‌కు రావడం ఎందుకు త‌గ్గించారు? అనే డిబేట్ ఇటీవ‌లి కాలంలో విస్త్ర‌తంగా సాగుతోంది. చాలా మంది ఓటీటీల రాక‌తో థియేట‌ర్ల వ‌ర‌కూ వెళ్లేందుకు ఆసక్తి క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని, ఇంట్లోనే స్మార్ట్ టీవీలో వీక్ష‌ణ‌కు అల‌వాటు ప‌డ్డార‌ని చాలామంది విశ్లేషిస్తున్నారు.

మ‌రోవైపు  జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డానికి టికెట్ ధ‌ర‌ల‌ను మించి పాప్ కార్న్- కోక్ కోసం చెల్లించాల్సి వ‌స్తోంద‌ని, ఫ్యామిలీతో థియేట‌ర్ కి వెళితే జేబులు ఖాళీ అయిపోతున్నాయ‌ని ర‌క‌ర‌కాలుగా విశ్లేషిస్తున్నారు. అమీర్ ఖాన్ లాంటి న‌టుడు ఓటీటీల వెల్లువ‌తో ఈ దుస్థితి త‌లెత్తింద‌ని భావించి త‌న సినిమాల‌ను 8 వారాల త‌ర్వాతే ఓటీటీల‌లో విడుద‌ల చేసేలా చాలా స్ట్రిక్టుగా ఒప్పందాలు చేసుకుంటున్నాడు.

ఇప్పుడు మ‌రో పెద్ద మీరో రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్ దావాన‌లంలా ఇండ‌స్ట్రీని చుట్టేస్తోంది. ఆయ‌న య‌థాలాపంగా స‌ర‌దాగా న‌వ్వేస్తూ విసిరిన పంచ్ చాలా ఆలోచింప‌జేస్తోంది. రిప‌బ్లిక్ సమ్మిట్‌లో రామ్ చరణ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు  ప్ర‌కంప‌నంలా మారాయి. అస‌లు థియేట‌ర్ లో కార్న్, కోలాలు ధ‌ర‌లు త‌గ్గాల‌నే సూచ‌న చేసిన‌ట్ట‌యింది. సినిమానే చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పేర్కొన్న చ‌ర‌ణ్ భార‌తీయ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్త మార్కెట్ పెరిగింది.. ఓటీటీల వ‌ల్ల కూడా ప్రయోజ‌న‌మే.. ఆస్కార్ వ‌ర‌కూ వెళ్లాం.. అయితే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు..కానీ పాప్ కార్న్ ధ‌ర‌లు త‌గ్గిస్తే బావుంటుంద‌ని స‌ర‌దాగా పంచ్ వేసారు....అని అన్నారు.

సినిమా అత్యంత చౌక‌న వినోదం .. అందువల్ల జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు.. అని చ‌ర‌ణ్ వ్యాఖ్యానించ‌డం ఉత్సాహం పెంచింది. సినీప‌రిశ్ర‌మ‌లో చాలా మంది పాప్ కార్న్, కోలాల ధ‌ర‌ల‌పై అసంతృప్తిగా ఉన్నా దానిపై ఎలాంటి కామెంట్లు చేయ‌రు. కొంద‌రు వ్యాఖ్యానించినా దానిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అమీర్ ఖాన్ లేదా చ‌ర‌ణ్ లాంటి స్టార్లు ఇలాంటివి గుర్తు చేసినప్పుడైనా మ‌ల్టీప్లెక్సుల్లో కోలాల ధ‌ర‌ల త‌గ్గింపుతో ఒక కొత్త మార్పు మొద‌ల‌వుతుంద‌ని ఆశిద్దాం. 

Ram Charan About Movie Ticket Multiplex Food Cost