ఈసారి సీరియస్ గా ఉన్న ప్రభాస్
Prabhas’s commitment to his work
ప్రభాస్ వల్లే సినిమాలు లేట్ అవుతున్నాయి. ఆయన డేట్స్ ఇచ్చినా కరెక్ట్ గా దానికి హాజరవరూ అంటూ చాలామందిలో చాలారకాల అపోహలు ఉన్నాయి. కారణం ఆయన సినిమాలు షూటింగ్స్ ఆలస్యమవడమే కాదు సినిమాలు అనుకున్న తేదికి రిలీజ్ అవ్వవు. అక్కడ దర్శకులదే లేట్ అని చాలామందికి తెలుసు.
కానీ కొంతమంది హీరో ప్రభాస్ దర్శకులకు సహకరించరు, ఆయన కూడా సినిమా ఆలస్యానికి కారణమంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈసారి ప్రభాస్ తన సినిమాలు అనుకున్న సమయానికి వచ్చేలా ఎండనక చమటనక కష్టపడుతున్నారు. ఒకేసారి స్పిరిట్ అలాగే హను రాఘవపూడి ల ఫౌజీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
ఎండలోనూ ప్రభాస్ తన సినిమాలు పూర్తి కావాలని కష్టపడుతున్నారు స్పిరిట్ షూటింగ్ తో పాటుగా ఫౌజీ షూటింగ్ చేసి అది ఫినిష్ అవ్వగానే ఆ ప్లేస్ లో కల్కి 2 షూటింగ్ లో పాల్గొనాలని ప్రభాస్ ప్లానింగ్. అందుకే ఆయన సమ్మర్ వెకేషన్ కూడా వెళ్లకుండా దర్శకులకు అందుబాటులో ఉంటున్నారు.
ఈసారి ప్రభాస్ తను నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ విషయంలో చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు.







































