రూ.200 కోట్ల క్లబ్బులోకి దృశ్యం 3
Drishyam 3 joins 200 cr club
మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 చిత్రం గత గురువారం విడుదలైంది. మలయాళం లో యావరేజ్ టాక్ వచ్చినా మిగతా భాషల్లో మోహన్ లాల్ దృశ్యం 3 కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలకొచ్చిన హిట్ టాక్ దృశ్యం 3 కి రాలేదు.
అయినప్పటికి మోహన్ లాల్ స్టామినా, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాల కోసం ఆడియన్స్ దృశ్యం 3 ని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టారు. అందుకే దృశ్యం 3 మొదటి వారం పూర్తి చేసుకోకుండానే రూ.200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ కన్నా దృశ్యం 3 కి ఓవర్సీస్ మార్కెట్ బాగా కలిసొచ్చింది.
వరల్డ్ వైడ్ గా దృశ్యం 3 అఫీషియల్ గా రూ.200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడం చూసి బాబోయ్ డివైడ్ టాక్ ఉన్న దృశ్యం 3 కి ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే ఆడియన్స్ సినిమాల కోసం ఎంతగా కరువాసిపోయారో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్స్.







































