Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No clarification on Peddi Release Trailer

పెద్ది రిలీజ్ ట్రైలర్ ఉందా

No clarification on Peddi Release Trailer

 

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది ప్రమోషన్స్ చాలా బిజీగా వున్నారు. పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ అంటూ ఇండియాని చుట్టేస్తున్న రామ్ చరణ్ పెద్ది తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ అభిమానులు ఫిక్స్ అయ్యారు. కారణం పెద్ది ఫస్ట్ షాట్, మూడు పాటలు, పెద్ది పహిల్వాన్ గ్లింప్స్, ట్రైలర్ అన్ని పెద్దిపై అంచనాలు పెంచేసాయి.

అయితే పెద్ది ట్రైలర్ పై చిన్న చిన్న విమర్శలు వినిపించాయి. రెహమాన్ BGM పై రామ్ చరణ్ వాయిస్ పై వినిపించిన విమర్శలకు పెద్ది మేకర్స్ రిలీజ్ ట్రైలర్ తో చెక్ పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రిలీజ్ ట్రైలర్ పై దర్శకుడు బుచ్చి బాబు వర్క్ చేస్తున్నాడని.. రెండుమూడు రోజుల్లో పెద్ది రిలీజ్ ట్రైలర్ వదులుతారని అంటున్నారు.

అయితే పెద్ది రిలీజ్ ట్రైలర్ నిజంగా ఉంటుందా, లేదంటే రూమరా అనేది తెలియాల్సి ఉంది. కానీ పెద్ది పై ఉన్న అంచనాలు చూస్తుంటే పెద్ది ఓపెనింగ్స్ తో రికార్డ్ కలెక్షన్స్ సాధించడం మాత్రం పక్కా అనిపిస్తుంది.
 

Confusion among Peddi Release Trailer