పెద్ది కి హెల్ప్ చేసిన స్టార్ హీరోస్
Suriya, Mohanlal help Peddi
రామ్ చరణ్ పెద్ది చిత్రానికి ఇండైరెక్ట్ గా రెండు భాషల స్టార్ హీరోలు హెల్ప్ చేశారు అనే చెప్పాలి. జూన్ 4 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కాబోతున్న పెద్ది చిత్ర ప్రమోషన్స్ లో రామ్ చరణ్ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ లు పాల్గొంటున్నారు. ముంబై మీట్, భోపాల్ ఈవెంట్, బెంగళూరు ప్రెస్ మీట్, చెన్నై ఈవెంట్ అంటూ రామ్ చరణ్ హీరోయిన్ తో కలిసి పెద్దిని ప్రమోట్ చేస్తున్నారు.
అయితే కొన్ని వారాలుగా టాలీవుడ్ నుంచి మోలీవుడ్ వరకు థియేటర్స్ అన్నీ పెద్ద సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలు రాక నిస్తేజంగా పడివున్నాయి. టాలీవుడ్ పరిస్థితి అయితే మరీ ఘోరం. పెద్ది పైనే ప్రేక్షకుల ఆశలు పెట్టుకున్నారు. అయితే తమిళనాట సూర్య కరుప్పు మంచి హిట్ అవడంతో అక్కడి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.
అదే ఊపులో పెద్ది రాబోతుంది. ఆడియన్స్ మైండ్ సెట్ కరుప్పు మార్చేసింది. ఇక మలయాళంలోనూ మోహన్ లాల్ దృశ్యం 3 కి యావరేజ్ టాక్ తోనే అద్భుతమైన హిట్ ఇచ్చారు. సో మలయాళీలు కూడా దృశ్యం 3 ఊపులో పెద్ది ని ఆదరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అలా సూర్య తమిళనాట, మోహన్ లాల్ మలయాళం లో పెద్దికి చరణ్ కి ఇండైరేక్ట్ గా హెల్ప్ చేసారు అనే చెప్పాలి.







































