ఫ్యామిలీతో హాలిడే ని ఎంజాయ్ చేస్తున్న AA
Allu Arjun Holidaying in Paris
ఈ ఏడాది తమ్ముడు అల్లు శిరీష్ వివాహం వేడుకల కోసం అట్లీ తో చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం రాకా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఆతర్వాత షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. శిరీష్ వెడ్డింగ్ తర్వాత ఎలాంటి బ్రేక్ లేకుండా రాకా షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ షూటింగ్ కి చిన్న బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి చేక్కేసారు.
భార్య స్నేహ రెడ్డి, పిల్లలు ఆయన్, అల్లు అర్హ తో కలిసి అల్లు అర్జున్ పారిస్ ట్రిప్ కి వెళ్లారు. ఇక్కడ సమ్మర్ హీట్ ని పారిస్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అల్లు అర్జున్. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ కాస్త రిలాక్స్ అయ్యి వచ్చాక అల్లు అర్జున్ మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతారట.
జూన్ నుంచి రాకా కోసం ముంబైలో ప్లాన్ చేస్తున్న లాంగ్ షెడ్యూల్ ఈ సినిమాకే హైలైట్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్స్, హై ఓల్టేజ్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నారని సమాచారం.







































