మా ఇంటి బంగారం ట్రైలర్ : నిజంగా బంగారమే
Maa Inti Bangaram Trailer Released
చాలా రోజుల తర్వాత సమంత నుంచి వస్తున్న చిత్రం మా ఇంటి బంగారం.. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు నిర్మాతగా తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం జూన్ 19 న విడుదల కాబోతుంది. తాజాగా సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ట్రైలర్ వదిలారు.
కంబైన్డ్ ఫ్యామిలోకి కోడలిగా అడుగుపెట్టి.. కుటుంబ బాధ్యతలు తీసుకుకోవడం ఏవి చేతకాక వేరొకరితో పోటీకి దిగి, కుటుంబాన్ని కాపాడుకునే కోడలి పాత్రలో సమంత కనిపిస్తుంది. చిన్న కోడలు శ్రీముఖి తో పూలల్లడం, వంట చెయ్యడంలో పోటీ పడలేను కానీ నా ఫ్యామిలీకి ఏమి కాకూండా నా ప్రాణం అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటా అంటూ చీకట్లో విలన్స్ ని చితకొట్టేసిన సమంత భాషలోని యాస ఆకట్టుకుంటుంది.
సమంత ట్రెడిషనల్ గానే చీరకట్టులో రౌడీలను చితకబాదేసిన సీన్స్ కట్టుకుంటాయి. మా ఇంటి బంగారం ట్రైలర్ కి సినిమాటోగ్రఫీ, BGM , నందిని రెడ్డి దర్శకత్వం, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా కుదిరాయి.







































