Loading...

లక్కీ మీనాక్షి చౌదరి

Karthi romance Meenakshi Chaudhary


సంక్రాంతికి వచ్చి హిట్లు కొడుతున్న లక్కీ మీనాక్షి చౌదరి ని నిజంగానే అదృష్టం వెంటాడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య తో వృషకర్మ లో నటిస్తున్న మీనాక్షి కి కోలీవుడ్ లో ఏమంత కలిసి రాలేదు. విజయ్ లాంటి స్టార్ హీరోతో నటించినా అక్కడ అమ్మడు కి హిట్ దక్కలేదు.

ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తో తెలుగు లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్. నాగవంశీ నిర్మాతగా సితార బ్యానర్ లో మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించబోయే చిత్రంలో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరో, హీరోయిన్ మీనాక్షి చౌదరి. కార్తీ బర్త్ డే సందర్భంగా ఈరోజే పూజా కార్యక్రమం నిర్వహించారు మేకర్స్.

ఆ ఓపెనింగ్ లో మీనాక్షి చౌదరి చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ లుక్ లో ట్రెడిషనల్ గా కనిపించింది. అది చూసే వావ్ మీనాక్షి చాల లక్కీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
 

Meenakshi Chaudhary to pair with Karthi in Kalyan Shankar's next