ప్రభాస్ కోసం రెడీ అవుతున్న అల్ట్రా లగ్జరీ హౌస్
Prabhas readying his dream mansion
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ అంటూ టైమ్ వేస్ట్ చెయ్యకుండా తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ లో తలమునకలై ఉన్నారు. అటు ఫౌజీ ఇటు స్పిరిట్ రెండు సినిమాలు పారలల్ గా షూటింగ్స్ చేసుకుంటున్నారు. మరోపక్క ప్రభాస్ కోసం కల్కి 2 షూటింగ్ ప్రభాస్ కోసం వెయిటింగ్.
పాన్ ఇండియా స్టార్స్ లో నెంబర్ 1 ప్లేస్ లోనే కాదు అత్యధిక పారితోషకం అందుకుంటున్న ప్రభాస్ తాజాగా హైదరాబాద్ లోని కాస్ట్లీ ఏరియా అయిన కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు దగ్గరలో రెండెకరాల స్థలంలో అల్ట్రా లగ్జరీ హౌస్ నిర్మించుకోవడానికి రెడీ అయ్యారు. రీసెంట్ గానే ఈ ల్యాండ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు మున్సిపల్ అధికారుల నుండి అవసరమైన అన్ని రకాల నిర్మాణ అనుమతులు లభించడంతో, డార్లింగ్ తన కలల సౌధాన్ని నిర్మించుకునే పనిలో పడ్డారు.
కోకాపేట లో ఎకరం దాదాపుగా రూ. 80 కోట్లపైనే ఉంది. రెండెకరాలు అంటే రూ.160 కోట్ల రేటును స్థలంలో ప్రభాస్ అత్యాధునిక హంగులతో అల్ట్రా లగ్జరీ హౌస్ ని నిర్మించుకోబోతున్నారు. ఇల్లు మాత్రమే కాదు, ఒక మినీ రిసార్ట్‌ను తలపించేలా ఉండబోతోందని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా దీని ఇంటీరియర్ డిజైనింగ్‌ను ప్లాన్ చేశారని టాక్.
ఈ అల్ట్రా లగ్జరీ ప్యాలెస్‌లో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కొన్ని అత్యాధునిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ప్రభాస్ ప్రత్యేకంగా హై-ఎండ్ ఫిట్‌నెస్ సెంటర్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌తో కూడిన ప్రైవేట్ థియేటర్, ప్రశాంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి చుట్టూ ఆహ్లాదాన్ని పంచేలా పచ్చని ల్యాండ్‌స్కేపింగ్ గార్డెన్ ఇలా ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్థాయిలో తయారవ్వబోతుంది అని తెలుస్తుంది.
ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ నిర్మించుకోబోయే అల్ట్రా లగ్జరీ హౌస్ ముచ్చట్లే కనిపిస్తున్నాయి.







































