పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్
Pawan Kalyan's ultra stylish look
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టడం మానేశారు, ఆయన రాజకీయాల్లో వైట్ కుర్తా ప్యాంట్ తోనే ఎక్కువగా కనిపిస్తున్నారు తప్ప బయట మాత్రం ఎప్పుడు స్టైలిష్ లుక్ లో పవన్ కనిపించడం లేదు అని ఆయన ఫ్యాన్స్ కంప్లైంట్. ఈమధ్యన అనారోగ్యంతో చిన్న సర్జరీ చేయించుకుని కొద్దిరోజులు ఇంటికే పరిమితమయ్యారు పవన్.
ఆతర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాల్లో కాని, జనసేన బలోపేత సమావేశాల్లో కానీ, ఇలా బయట ఎక్కడ కనిపించినా అల్ట్రా స్టైలిష్ లుక్ తోనే అంటే సినిమా స్టార్ట్ లా చాలా స్టైలిష్ గా కనిపిస్తునారు. ఈరోజు రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్స్ సందర్శన, గోదావరిలో బోటు సందర్శనలోను పవన్ మోడ్రెన్ లుక్ లో కనిపించారు.
రాజకీయాల్లోకి వెళ్ళాక పూర్తిగా లుక్ మార్చేసిన పవన్ ఇలా చాలా రోజుల తర్వాత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అది చూసిన పవన్ ఫ్యాన్స్ తెగ సర్ ప్రైజ్ ఫీలవుతున్నారు.







































