జూన్ పైనే ఆశలన్నీ
June month movie releases
టాలీవుడ్ 2026 ప్రథమార్ధం సంక్రాంతి తర్వాత ఏమంత ఆశాజనకంగా లేదు. ధురంధర్ 2 డబ్బింగ్ మూవీ తప్ప మరో మంచి సినిమా లేక ఆడియన్స్ డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. మే అయితే మరింతగా బోర్ కొట్టించేసింది. చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేక చేతులెత్తేశాయి.
ఇక టాలీవుడ్ ప్రేక్షకుల ఆశలన్నీ జూన్ నెల పైనే ఉన్నాయి. ముఖ్యంగా జూన్ లో రాబోయే చరణ్ పెద్ది, అఖిల్ లెనిన్ లపైనే అందరిలో విపరీతమైన నమ్మకం కనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యవు అని నమ్ముతున్నారు. సమంత మా ఇంటి బంగారం, సింగ్ గీతం లాంటి చిత్రాలు జూన్ లోనే విడుదలకాబోతున్నాయి.
జూన్ 4 న విపరీతమైన అంచనాలతో రామ్ చరణ్ పెద్ది రాబోతుంది. దానికి రెండు వారాల గ్యాప్ లో సమంత మా ఇంటి బంగారం.. ఆతర్వాత వారానికే అఖిల్ లెనిన్ జూన్ 26 న విడుదల కాబోతున్నాయి. మరి ఆడియన్స్ ఆశలు జూన్ వమ్ము చెయ్యకుండా ఉంటె చాలు.







































