Loading...

అప్పుడు ఇష్టం లేకుండా..ఇప్పుడేమో ఇష్టంతో!

Sneha Ullal says Bollywood debut

 

`ఉల్లాసంగా ఉత్సాహంగా`, `కరెంట్` వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి స్నేహా ఉల్లాల్ చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మ‌డు  సినీ కెరీర్ ప్రారంభానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను 16 ఏళ్ల వయసులోనే, పదో తరగతి పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కాలేజీలో అడుగుపెడుతున్న సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ సరసన `లక్కీ` చిత్రంలో నటించే అవకాశం  వచ్చిందన్నారు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ స్నేహితుల ద్వారా తనకు ఈ ఆడిషన్ అవకాశం లభించిందని ఆ ఒక్క సినిమాతోనే తన జీవితం ,కెరీర్ పూర్తిగా మలుపు తిరిగాయని  గుర్తుచేసుకున్నారు.

అయితే ఆ సమయంలో  సినిమాల్లోకి  ప్రవేశించడం వెనుక గల భావోద్వేగపూరితమైన కారణాలను కూడా స్నేహా ఉల్లాల్ బయటపెట్టారు. ఆ రోజుల్లో త‌న తల్లి క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతుండటంతో కుటుంబం మొత్తం తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా అవకాశం రావడం వల్ల కుటుంబ సభ్యుల్లో కొంతైనా ఆనందం, ఉపశమనం నింపవచ్చనే ఉద్దేశంతో ఆమె ఆ ప్రాజెక్ట్‌ను అంగీకరించారు.  తన తల్లికి ప్రయా ణాలన్నా, కొత్త ప్రదేశాలను చూడాలన్నా ఎంతో ఇష్టమని షూటింగ్‌ల నెపంతో ఆమెను వివిధ ప్రాంతాలకు వెంట తీసుకెళ్లవచ్చనే ఆలోచనతోనే న‌టిగా మారాన‌ని  ఎమోషనల్ అయ్యారు.

త‌న‌కు మంచి న‌టిగా ఇండ‌స్ట్రీ గుర్తింపు ఇచ్చినా? వ్యక్తిగత జీవితంలో ఎంతో అమూల్యమైన కాలేజీ రోజులను, స్వేచ్ఛను దూరం చేసిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  పదహారేళ్లకే నటిగా మారడం వల్ల తన టీనేజ్ జీవితాన్ని పూర్తిగా కోల్పోయానని, అప్పటికప్పుడు పెద్దదాన్ని అయిపోయినట్లు అనిపించిందన్నారు.  సినిమా రంగంలో వాతావ రణం అంతగా బాగుండదని, అసభ్యత ఎక్కువగా ఉంటుందని ఇంట్లో వారు భయపెట్టడం,  తన శారీరక రూపంపై తనకున్న కొన్నిర‌కాల  అపోహల వల్లే తాను నేక ఆఫర్లకు, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండిపోయానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మళ్లీ మంచి కథాబలం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో బిజీ కావాలని ఆశిస్తున్నట్లు స్నేహా వెల్లడించారు.

Sneha Ullal says Bollywood debut at 16 was a compromise