Loading...

సిస్టమ్ ఓటీటీ రివ్యూ

System OTT Review

సిస్టమ్ ఓటీటీ రివ్యూ

బాలీవుడ్ లో రీసెంట్ గా తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా సిస్టమ్. అశ్వనీ అయ్యర్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామా సిస్టమ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. కోర్ట్ నేపథ్యంలో తెరకెక్కిన సిస్టమ్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో మినీ సమీక్షలో చూసేద్దాం.

సిస్టమ్ మినీ స్టోరీ: 
సక్సెస్ ఫుల్ లాయరైన తండ్రి రవి రాజ్ వంశ్ ( అశుతోష్ గోవారికర్) లా ఫామ్ లో చేరి ఆ స్టేటస్ ని అనుభవిద్దామని కలలు కనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా (సోనాక్షి సిన్హా) కి తండ్రి పది కేసులు గెలిచి అప్పుడు తన లా ఫామ్ లో చేరమని ఛాలెంజ్ చేస్తారు. దానికి ఒప్పుకున్న నేహా కి వరసగా కేసులు గెలిచే అవకాశం అది కూడా సారిక (జ్యోతిక) స్టెనో గ్రాఫర్ సలహాలతో రావడంతో ఆమె తండ్రి ఛాలెంజ్ కి దగ్గరై.. చివరికి తన తండ్రి తోనే తలపడే కేసుతో కోర్టులో వాధిస్తుంది. ఆ కేసు ఏమిటి, నేహా తండ్రి పై ఆ కేసులో గెలిచిందా, తండ్రి - కూతురు ఛాలెంజ్ లో గెలుపెవరిది అనేది సిస్టమ్ షార్ట్ స్టోరీ.

సిస్టమ్ ఎఫర్ట్స్:
లాయర్ గా సోనాక్షి సిన్హా కాస్త బబ్లీ గా కనిపించినా ఆ పాత్రకు ఆమె న్యాయం చేసింది, కోర్టు లో స్టెనో గ్రాఫర్ గా, ప్రతీకారం తీర్చుకునే సాధారణ మహిళగా జ్యోతిక ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ లాయర్ గా అశుతోష్ గోవారికర్ నటన హైలెట్ గా నిలుస్తుంది.

సిస్టమ్ స్క్రీన్ ప్లే:
దర్శకుడు కథను చాలా స్లో గా స్టార్ట్ చేసారు. కోర్ట్ డ్రామా అంటేనే వాదనలు, ప్రతి వాదనలతో దద్దరిల్లిపోతుంది. కానీ సిస్టర్ లో అలాంటి బలమైన వాదనలు, ప్రతివాదనలు అనేవి క్లైమాక్స్ వరకు కనిపించవు. వాదనలు స్లో గా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. నేహా ఇంకా సారిక ఫ్రెండ్ షిప్, అలాగే నేహా ఆమె తండ్రి రవి మద్యన కోర్ట్ వాదనలు ఆకట్టుకుంటాయి. విక్రమ్ బజ్రాల్ కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం వేగాన్ని పుంజుకుని, క్లైమాక్స్ ను రక్తి కట్టిస్తుంది. కథ సాదాసీదాగా ఉన్నా.. కథనం ఆకట్టుకుంది.

మెయిన్ గా సిస్టమ్ లో లొసుగులు చూసుకుని నేరస్తులు ఎలా తప్పించుకోవచ్చు, అదే లొసుగులతో ఓ నేరస్తురాలు మంచితనంతో ఎలా తప్పించవచ్చో ఈ సిస్టమ్ లో చూపించారు దర్శకుడు.

సాంకేతికంగా.. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రెమ్ ని నీట్ గా చూపించగా.. BGM అలా అలా సాగుతుంది. ఇక ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సిస్టమ్ లాంటి కథలతో ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ లు వచ్చినా కోర్ట్ డ్రామా వచ్చింది అంటే ఆడియన్స్ మాత్రం తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తారు. అలా ఈ సిస్టమ్ పై కూడా ఓటీటీ ఆడియన్స్ ఓ కన్నెయ్యొచ్చు. 

System Movie Review