Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Government in BIG Trouble- Stalin Predicts

విజయ్ ది సినిమా సునామి

Vijay Government in BIG Trouble- Stalin Predicts


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్టించారు. అదే ఊపులో కూటమి కట్టి సీఎం కుర్చీని అధిష్టించారు. విజయ్ ప్రభంజనం ముందు డీఎంకే, అన్నాడీఎంకే లు ప్రతిపక్ష పార్టీలుగా మిగిలిపోయాయి. అందులో అన్నాడీఎంకే లోని కొంతమంది ఎమ్యెల్యే లు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు.

అయితే డీఎంకే పార్టీ తమిళనాడులో ఘోర పరాజయాన్ని చవి చూసింది. స్టాలిన్ మాత్రం విజయ్ ప్రభుత్వానికి కాస్త సమయమిద్దాము అంటూనే తమిళనాట విజయ్ టీవీకే ప్రభుత్వం ఐదేళ్ల పాటు మనుగడ సాగించడం కష్టం. విజయ్ ప్రభుత్వం తమ డీఎంకే పార్టీ దయతో నడుస్తుంది అంటూ వ్యంగ్యంగా మట్లాడుతున్నారు.

అంతేకాదు ఎన్నికల్లో వచ్చింది రాజకీయ ప్రభంజనం కాదు. కేవలం సినిమా సునామీ. హీరో పై ఉన్న అభిమానము, ఆయనపై ఉన్న ఉత్సాహంతో ప్రజలు విజయ్ కి ఓట్లు వేశారు. కొన్నాళ్లకు ఆ క్రేజ్, ఆసక్తి తగ్గుతుంది. తర్వాత తల్లి కోసం బిడ్డ వెతికినట్లుగా ప్రజలు డీఎంకే కోసం వెతుకుతారు.. అంటూ స్టాలిన్ విజయ్ ప్రభుత్వం పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Vijay Government in BIG Trouble? Stalin Predicts Tamil Nadu Political Collapse