రుక్మిణి వసంత్ బికినీ పిక్స్ సంచలనం

హీరోయిన్ రుక్మిణి వసంత్ సరికొత్త సైబర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత దుర్వినియోగం తో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రుక్మిణీ తాజా బాధితురాలిగా మారారు. ఇంట ర్నెట్లో కొందరు ఆకతాయిలు రుక్మిణి పేరిట సృష్టించిన నకిలీ మార్ఫింగ్ ఏఐ చిత్రాలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ చిత్రాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని అవన్నీ పూర్తిగా కృత్రిమంగా సృష్టించిన నకిలీ చిత్రాలని ఖండించారు. వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే విధంగా ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను తయారు చేయడం వాటిని ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని మండిపడ్డారు. ఈ విషయాన్ని టీమ్ తీవ్రంగా పరిగణించిందని అందుకు కారణమైన వారిపై సైబర్ క్రైమ్ విభాగంలో చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించారు.
అలాగే నకిలీ పోస్టులను ఎవరూ షేర్ చేయోద్దని వాటికి దూరంగా ఉండాలని అభిమానులను కోరారు. సినిమా రం గంలో నటీమణులను టార్గెట్ చేస్తూ ఇలాంటి డీప్‌ఫేక్, ఏఐ చిత్రాలను సృష్టించడం ఇటీవల కాలంలో ప్రమాద కరమైన ట్రెండ్‌గా మారింది. గతంలోనూ రుక్మిణి వసంత్ పేరు ఉపయోగించి అపరిచిత వ్యక్తి ఫోన్ నంబర్ ద్వారా మోసాలకు పాల్పడగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికత ఇంతలా వేగంగా విస్తరిస్తున్న నేటి డిజిటల్ యుగం లో సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్న ఇలాంటి వికృత చేష్టలను అరికట్టడానికి కఠినమైన సైబర్ చట్టాల ఆవశ్యకత ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







































