King 100 పై ఓ అప్ డేట్ వస్తే బావుండేది
May 23 Marks The Start Of A 40 Year Film Journey For Akkineni Nagarjuna
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చిన్న కొడుకు అఖిల్ నటిస్తున్న లెనిన్ నుంచి సర్ ప్రైజ్ గా టీజర్ వదిలి తండ్రికి బెస్ట్ విషెస్ తెలిపారు. అదే విధంగా నాగార్జున కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోయే చిత్రం #King100 నుంచి కూడా ఓ అప్ డేట్ వదిలితే బావుండేది.. ఇది అక్కినేని అభిమానుల కోరిక.
అక్కినేని నాగార్జున #King100 మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఓ ఫోటో షేర్ చేసారు. ఆతర్వాత ఈ చిత్రంలోకి హీరోయిన్ గా టబు ఎంటర్ అయ్యింది అని చెప్పారు తప్ప #King100 పై ఎలాంటి అప్ డేట్ లేదు. అందుకే ఈ స్పెషల్ డే రోజున #King100 నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తే బావుండేది అని.
కానీ నాగార్జున ఈ విషయమై ఎలాంటి ఆలోచన లేనట్లుగా ఉంది. కొడుకు లెనిన్ టీజర్ తోనే సరిపెట్టుకోమని ఆయన ఫ్యాన్స్ కి చెప్పకనే చెప్పేసారు. తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో నాగ్ తన 100 మూవీ చేస్తున్నారు.







































