ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara is vacationing in Vatican City

వాటికన్ సిటీలో నయన్ ఫ్యామిలీ


లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యామిలీ వాటికన్ సిటీలో సమ్మర్ వెకేషన్ ని తెగ ఎంజాయ్ చేస్తుంది. గత కొద్దిరోజులుగా భర్త విగ్నేష్ శివన్ , ఇంకా పిల్లలతో కలిసి నయనతార యూరప్ ట్రిప్ లో ఛిల్ అవుతూ ఎంజాయ్ చెయ్యడమే కాదు ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.

ఇక్కడ ఎండలు మండిపోతుంటే నయనతార భర్త పిల్లలతో కలిసి షూటింగ్స్ కి బ్రేకిచ్చి యూరప్ ట్రిప్‌లో భాగంగా రోమ్, వాటికన్ సిటీ వీధుల్లో ఛిల్ అవడం అభిమానులకు బాగా నచ్చేసింది. సరదాగా భర్త విగ్నేష్ శివన్ తో కలిసి వీధుల్లో కలియ తిరిగేస్తున్న నయనతార కొడుకులతోను ఆడుకుంటూ ఆనందంగా గడిపేస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ - వంశి పైడిపల్లి ప్రాజెక్ట్, అలాగే తమిళ సినిమాలతో బిజీగా వున్న నయనతార టాలీవుడ్ లో చెయ్యాల్సిన బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ నుంచి తప్పుకుంది. 

Nayanthara ,Nayanthara is vacationing in Vatican City