పెద్ది అఫీషియల్ అన్నారు కానీ రాలేదుగా

ఈరోజు గురువారం జరిగిన మెగా 158 చిత్ర ఓపెనింగ్ సెర్మోని కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను గెస్ట్ లు గా ఆహ్వానించడమే కాదు అఫీషియల్ గా చరణ్, పవన్ వస్తున్నారు అంటూ ఆర్భాటంగా ప్రకటించారు కూడా. అయితే ఈ రోజు జరిగిన మెగా 158 పూజా వేడుకల్లో పవన్ కళ్యాణ్ హైలెట్ అయ్యారు.
కానీ పెద్ది రామ్ చరణ్ మాత్రం ఈ మెగా పూజకు హాజరవలేదు. దానితో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే రామ్ చరణ్ నిన్నటి వరకు వస్తాను అన్నప్పటికీ ముంబై లో పెద్ది ప్రమోషన్స్ లో పాల్గొనడం వలన కుదరలేదు అంటున్నారు. అయితే ఎంత ప్రమోషన్స్ ఉన్నా వస్తాను అని చెప్పారు.. చెప్పాక మిస్ అవడమేమిటి...
ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తే ఎంతసేపు అంటూ కొంతమంది రామ్ చరణ్ రాకపోవడం పై కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క పెద్ది ప్రమోషనల్ షెడ్యూల్స్ వల్లే చరణ్ ఈ కార్యక్రమానికి హాజరవలేదు అంటున్నారు. ఇక మెగా బ్రదర్స్ ఈ వేడుకలో హైలెట్ అయ్యారు. మెగాస్టార్ చిరు మెగా 158 కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు.






































