మోహన్ లాల్ దృశ్యం 3 పబ్లిక్ టాక్

 

మోహన్ లాల్ హీరోగా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్స్ దృశ్యం, దృశ్యం 2 ఇలా ఈ సీరీస్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ చిత్రాలు మిగతా భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా అద్భుతమైన హిట్ గా నిలిచాయి. ఇక సీరీస్ లో దృశ్యం 3 నేడు మే 21 న థియేటర్స్ లో విడుదలైంది.

ఈరోజే తెలుగులోనూ దృశ్యం 3 డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దృశ్యం 3 టాక్ లోకి వెళితే.. దృశ్యం 3 ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ తో పాటుగా క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది.  

కాకపోతే ఈ చిత్రంలో కనిపించిన కొన్ని కేరెక్టర్స్ వాటి మధ్యన ఉన్న కనెక్షన్స్ కన్ఫ్యుజింగ్ గా అనిపిస్తాయి. BGM, జీతూ జోసెఫ్ దర్శకత్వం, ఇంకా స్క్రీన్ ప్లే బావున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చెయ్యడంలో నిరాశపరచదు. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని ఓసారి వీక్షించెయ్యొచ్చు

Drishyam 3 ,Mohanlal Drishyam 3 Public Talk