పాపం అనన్య.. 2ని.ల లిప్-లాక్ సీన్లు కోసేసారు

 

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే, యువ నటుడు లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ రొమాంటిక్ డ్రామా `చంద్ మేరా దిల్` చిత్రం మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ సోని ఈ చిత్రానికి దర్శ‌కుడు. విరహం, హృదయ వేదనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి కొన్ని రోజుల ముందే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన షాక్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. క‌థ‌లో భాగంగా అనన్యా పాండే ఎంతో బోల్డ్‌గా నటించిన రొమాంటిక్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కోసేసింది. సినిమాలో ఉన్న శృంగారభరిత..సన్నిహిత దృశ్యాల కారణంగా బోర్డు సభ్యులు పలు మార్పులు సూచించి ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికేట్‌ను ఖరారు చేశారు.

ఇందులో రొమాంటిక్ సన్నివేశాల నుంచి దాదాపు రెండు నిమిషాల నిడివి గల (ఖచ్చితంగా చెప్పాలంటే 96 సెకన్ల) ముద్దు సీన్లను సెన్సార్ ఎడిటర్లు పూర్తిగా కత్తిరించారు. ఇందులో భాగంగా స్క్రీన్‌పై కెమిస్ట్రీని పండించే ఒక 10 సెకన్ల సుదీర్ఘమైన ముద్దు సీక్వెన్స్‌తో పాటు వేర్వేరు సందర్భాల్లో వచ్చే దాదాపు 1 నిమిషం 26 సెకన్ల నిడివి గల మరికొన్ని ఘాటైన లిప్-లాక్ సీన్లను కూడా తొలగించి వాటి స్థానంలో వేరే విజువల్స్ ఉంచారు.

ఈ భారీ కట్స్ తర్వాత ప్రస్తుతం 135.36 నిమిషాల (సుమారు 2 గంటల 15 నిమిషాల) రన్‌టైమ్‌తో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక సాయంత్రం షోల కంటే డేలో న‌డిచే షోల‌కు టికెట్ ధ‌ర‌ల్ని త‌గ్గించి కొత్త వ్యూహాన్ని చిత్ర‌బృందం అనుస‌రిస్తోంది.
 

Ananya Pandey ,Ananya Pandey in Chand Mera Dil