Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Manoj Confirms Wife's Political Entry

భార్య పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ కామెంట్స్

Manchu Manoj Confirms Wife's Political Entry


మంచు మనోజ్ భూమా మౌనిక ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అటు మౌనికకు కూడా రెండో వివాహం కావడం గమనార్హం. భూమా ఫ్యామిలీ.. మొదటినుంచి పొలిటికల్ ఫ్యామిలీ. మంచు మనోజ్ తో వివాహం తర్వాత మౌనిక రాజకీయంగా యాక్టీవ్ గా లేదు. ఆమె అక్క భూమా అఖిల ప్రియా ఎమ్యెల్యే.

కానీ మౌనిక ఇప్పటివరకు రాజకీయాల పట్ల అంత సుముఖంగా కనిపించలేదు. తాజాగా మంచు మనోజ్ రేపు మే 20 తన బర్త్ డే సందర్భంగా మీడియా మిత్రులకు ఇచ్చిన విందులో తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ని కన్ ఫర్మ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు తాము ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని మనోజ్ తెలిపారు. ఇక మీడియా వారు మనోజ్ ని మీ తండ్రి మోహన్ బాబు గారితో సంబంధాలు ఎలా ఉన్నాయి అని అడిగితె.. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ మైక్‌తో వెళ్లకండి, వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అంటూ కాస్త వ్యంగ్యంగానే మనోజ్ బదులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

Mounika ,