బర్త్ డే అప్ డేట్స్ ఓకే - రిలీజ్ లు ఎప్పుడు

 

సుడిగాలి సుధీర్.. బుల్లితెర హీరోగా జబర్దస్త్ నుంచి పలు చానల్స్ లో యాంకర్ గా సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై హీరోగా అడుగుపెట్టాడు. గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ ఇలా సినిమాలు చేసిన సుడిగాలి సుధీర్ గత రెండేళ్ల కాలంగా ఆయన నటించిన సినిమాలేవీ విడుదలకు నోచుకోలేదు.

ఈరోజు సుధీర్ బర్త్ డే. సుధీర్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ వదిలారు మేకర్స్. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న హైలెస్సో సినిమా నుంచి ఫస్ట్ లుక్ వదులుతూ సుధీర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉన్న GOAT నుంచి సుధీర్ కి విషెస్ దక్కాయి.

అంతేకాదు సుధీర్ మరో చిత్రం సుధీర్ జోకర్ ఫస్ట్ లుక్ ని సుధీర్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేసారు. గత రెండేళ్లుగా తన నుంచి సినిమాలు విడుదల చెయ్యలేదు. ఈరోజు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్స్, అప్ డేట్స్ వచ్చాయి. మరి సినిమాలు ఎప్పుడు రిలీజ్ సుధీర్ అంటూ అడుగుతున్నారు ఆయన ఫ్యాన్స్.

 

Sudheer ,SUdigali Sudheer Birthday Special