దర్శకసంఘానికి 15లక్షలు..MB విరాళం

తెలుగు చలనచిత్ర దర్శక సంఘానికి నటుడు, నిర్మాత ఎం.మోహన్ బాబు వరాలు కురిపించారు. సంఘం సంక్షేమ కార్యక్రమాల కోసం 15లక్షల డొనేషన్ ప్రకటించారు. ప్రతియేటా దర్శక సంఘం నుంచి ఒక పేద విద్యార్థిని తనవద్దకు పంపిస్తే తిరుపతి విద్యానికేతన్ లో 6వ తరగతి నుంచి ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకూ ఉచితంగా అన్నీ తానే అయి చదివిస్తానని మాట ఇచ్చారు.
మూవీ ఆర్టిస్టుల సంఘం నుంచి పలువురు విద్యార్థులను చదివించిన విషయాన్ని ఈ సందర్భంగా వేదికపై గుర్తు చేసుకున్నారు. దర్శకసంఘం తరపున ఎన్.శంకర్ తదితరులు విచ్చేసి చెక్ ని అందుకోవాల్సిందిగా మోహన్ బాబు కోరారు. అలాగే తనకు ఎలాంటి అవార్డును పిలిచి ఇవ్వొద్దని కూడా ఈ సందర్భంగా అభ్యర్థించారు.
డబ్బులిచ్చి అవార్డు తీసుకున్నాడని అంటారు.. అంటూ ఛలోక్తి విసిరారు ఎంబీ. దివంగత డా.దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దర్శకసంఘం కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు పైవిధంగా స్పందించారు.







































