ఫౌజీ ప్రొడక్షన్ వ్యానుకు యాక్సిడెంట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ యూనిట్ లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. అదేమిటంటే ఫౌజీ షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ వ్యానుకు యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది.
ఈ ఘటనలో ఒకరి మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది.. ఇదే ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఫౌజీ యూనిట్ సభ్యులు షూటింగ్ కోసం బయలుదేరగా, ఆ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
కారు ప్రమాదానికి గురైన వెంటనే గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫౌజీ మేకర్స్ ఎప్పటికప్పుడు యూనిట్ సభ్యుల ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ వారికి కావాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తున్నారు.







































