ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha and Jayalalitha A fun comparision

విజయ్ తో సాన్నిహిత్యం - మరో జయలలిత త్రి

హీరో కమ్ పొలిటికల్ లీడర్ కాదు కాదు తమిళనాడు నూతన సీఎం విజయ్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్. పార్టీ పెట్టిన కొన్ని నెలల వ్యవధిలోనే భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున విజయ్ పై మాయని మచ్చలా త్రిష ఎపిసోడ్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.

త్రిష-విజయ్ ల నడుమ ఏం జరుగుతుంది. త్రిష వలనే విజయ్ భార్య విజయ్ కు విడాకులిస్తుందా, అసలు విజయ్-త్రిష వివాహం చేసుకుంటారా ఇవన్నీ పక్కనపెడితే.. త్రిష-విజయ్ లపై హాట్ హాట్ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సమయంలోనే వారిద్దరూ కలిసి పెళ్ళికి వెళ్లడం, విజయ్ ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు త్రిష చేస్తున్న ట్వీట్స్, ఎన్నికల లెక్కింపు రోజు తిరుమల వెళ్లి ప్రత్యేక పూజలు చేసి నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం..

విజయ్ ని కలిసి అభినందనలు తెలపడం ఇవన్నీ చూసాక గతంలో ఎంజీఆర్ పక్కనే ఉన్నజయలలితను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొద్దలు పెట్టారు. ఎంజీఆర్ నెచ్చెలిగా జయలలిత తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టినట్లుగా విజయ్ సన్నిహితురాలిగా త్రిష తమిళ రాజకీయాలను శాసించబోతుందా.. ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

త్రిష ను పార్టీలోకి తీసుకుని విజయ్ తమిళనాడును పాలించబోతున్నారా అనే ప్రశ్న అందరిలో మొదలయింది. మరి విజయ్ సీఎం అయ్యాక త్రిష ఏం చెయ్యబోతుందో చూడాలంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు.

MGR and Jayalalitha Vs Vijay and TrishaTrisha and Jayalalitha A fun comparision