సంక్రాంతికి వస్తున్నాం వెయిట్ చెయ్యాల్సిందే
Sankranthiki Vasthunnam OTT Release Delayedవిక్టరీ వెంకటేష్ నిజంగా విక్టరీలు కొడుతూ సంక్రాంతికి వస్తున్నాం తో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి సినిమా విడుదలైంది. ఇప్పటికి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై రెండు వారాలైంది. ఇప్పటికే 300 కోట్ల మార్క్ ని టచ్ చేసింది అయినప్పటికి టీమ్ ప్రమోషన్స్ ఆపడం లేదు.
రీసెంట్ గా భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాము టీం మొత్తం సక్సెస్ ని ఆడియన్స్ వేదికగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికి వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ డేట్ డిలే అవ్వొచ్చనే న్యూస్ వెంకీ అభిమానులను, ఫ్యామిలీ ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కన్నా రెండు రోజుల ముందు విడుదలైన డాకు మహారాజ్ ఓటీటీ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 9 న డాకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తోంది. కానీ థియేటర్స్ లో కలెక్షన్స్ రాబడుతున్న సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడప్పుడే ఓటీటీ లో వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు.
Makers Want To Delay Sankranthiki Vasthunnam OTT Release







































