ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anasuya with mask in Nampally exhibition

నాంపల్లి ఎగ్జిబిషన్ లో మాస్క్ తో అనసూయ

Anasuya with mask in Nampally exhibition

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత తయాక్టీవ్ గా ఉంటుందో తెలిసిన విషయమే. తన గ్లామర్ ఫొటోస్ తో పాటుగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ని ఎంజాయ్ చేసే ఫొటోస్ ను కూడా షేర్ చేస్తుంది. ఈమధ్యనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ కి వెళ్లిన అనసూయ తాజాగా నాంపల్లి నుమాయిష్ లో సందడి చేసింది. 

నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్ నుమాయిష్, అక్కడ వివిధ రాష్ట్రాల వారు తన ఉత్పత్తులను స్టాల్స్ పెట్టి ప్రమోట్ చేసుకుంటూ అమ్ముతారు. ఇక శని,ఆదివారాల్లో నాంపల్లి నుమాయిష్ కి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి అక్కడి వస్తువులను కొనుగోలు చేస్తూ, జెయింట్ విల్ లో ఆడుతూ పాడుతూ ఫుడ్ ని ఎంజాయ్ చేసూ ఉంటారు. 

అనసూయ కూడా తన కొడుకులతో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ లో మాస్క్ పెట్టుకుని వస్తువులు బేరమాడుతూ, కొడుకుతో కలిసి బజ్జిలు తింటూ ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేసింది. మరి అనసూయ మాస్క్ తో కనిపించడంతో అక్కడి వారెవరూ గుర్తుపట్టి ఉండరు. 

Anasuya and his sons enjoys Nampally Numaish

anasuya