దుబాయ్ లో తేలిన మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary floated in Dubai

హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం అంటూ సింపుల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ పట్టుకుపోయింది. గత ఏడాది లక్కీ భాస్కర్ తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన మీనాక్షిచౌదరి ఈ ఏడాది మొదలవగానే 300 కోట్ల హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఆదివారం రాత్రి భీమవరంలో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ జాతర తర్వాత నిన్న సోమవారం అమ్మడు 2025 లో ఫస్ట్ ట్రిప్ అంటూ దుబాయ్ వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫొటోస్ ను షేర్ చేసింది. క్యాజువల్ లుక్ లోనే కనిపించినా అమ్మడు వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి. 

ఈ సక్సెస్ తో అమ్మడు దగ్గరకు ఎలాంటి క్రేజ్ ప్రాజెక్ట్ వస్తాయో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం ప్రమోషన్స్ పూర్తి చేసేసి దుబాయ్ లో చిల్ అవడానికి అక్కడికి ఎగిరిపోయింది. 

Meenakshi Chaudhary-Took my first trip of 2025 with fam and it was none other than Dubai

meenakshi chaudhary