అమ్ముడు కాక-విడుదల కాక విల విలా
OTT Deals Delaying Film Releases
సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని కష్టాలు ఉంటాయో, నిర్మాతలు సినిమాలు విడుదల కాక ఎంతగా ఇబ్బందులు పడతారో అనే చాలామందికి తెలియదు. దర్శకులు, హీరోలు, ఇతర నటులు, టెక్నీకల్ టీం ఇలా అందరూ వేరే సినిమాలు చూసుకుని వెళ్ళిపోయినా నిర్మాతలు మాత్రం, ఆ సినిమా విడుదలయ్యే వరకు బిక్కు బిక్కు మంటూ బ్రతకాల్సిన పరిస్థితి.
సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదల ఏర్పాట్లు చేసుకున్నాక ఓటీటీ డీల్ పూర్తి కాకపోతే సినిమా విడుదలను ఆపుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఓటీటీ డీల్స్ ఫినిష్ కాక చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదల చెయ్యలేక నిర్మాతలు నలిగిపోతున్నారు.
భారీ అయినా చిన్న బడ్జెట్ అయినా పెట్టుబడి పెట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పాలవుతున్నారు. చాలా సినిమాలు ఓటీటీ డీల్స్ పై నమ్మకం పెట్టుకుని సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ ఆ డీల్ సెట్ అవ్వకపోతే సినిమాలు విడుదల చెయ్యలేక సతమతమైపోతున్నారు. ఓటీటీలు ఇదే అదునుగా షేరింగ్ అంటూ కొత్త మెలిక పెట్టడం నిర్మాతలకు ప్రాణ సంకటంగా మారింది.







































