ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika Mandanna The unstoppable force in Bollywood

రష్మిక కు ఎదురు లేదు

Rashmika Mandanna The unstoppable force in Bollywood


అవును ఇకపై నేషనల్ క్రష్ రష్మిక మందున్నకు ఎదురు లేదు. సౌత్ లో లీడింగ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న బాలీవుడ్ లోను జెండా గట్టిగానే పాతింది. అక్కడ ఆమె నటించిన సినిమాలు ఒకటో అరో తప్ప మిగతావన్నీ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టైల్ 2 గత శుక్రవారమే విడుదలైంది.

ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక లు నటించారు. అడల్ట్ కంటెంట్ అంటూ A సర్టిఫికెట్ ఇచ్చినా కాక్ టైల్ 2 చిత్రం కేవలం నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు కలెక్షన్స్ తేవడమంటే సినిమా హిట్ అనేగా అర్ధం.

కృతి సనన్ ని ఎత్తేస్తూ రష్మిక ను బాలీవుడ్ మీడియా బ్యాడ్ చేసినా.. సినిమా హిట్టు. అందులో రష్మిక ఉంది. సో రష్మిక హిట్ కొట్టింది అంతే. అక్కడ రష్మిక పై బ్యాడ్ గా పోట్రె చేసినా సౌత్ మీడియా రశ్మిక గ్లామర్ ని పొగిడింది. కృతి సనన్ ని పొగుడుతూ బాలీవుడ్ ఇండియా రష్మిక ను టార్గేట్ చేసినా.. సౌత్ మీడియా ఎక్కడా కృతి ని టార్గెట్ చెయ్యలేదు.

ఇకపై హిందీలోనూ రష్మిక కు ఎదురు ఉండదు. అమ్మడు పెళ్ళైనా తన జోరు సాగిస్తుంది. ఇంకా టాప్ హీరోస్ సరసన రష్మిక కు ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు.

Rashmika unstoppable in Bollywood