నిఖిల్ ఇలాగైతే ఎలాగయ్యా

Nikhil Silence Over Swayambhu ReleaseNikhil Silence Over Swayambhu Release

 

నిఖిల్ ఇలా సైలెంట్ గా ఉంటె జనాలు మర్చిపోతారు, పాన్ ఇండియా ఫిలిం స్వయంభు విడుదల తేదీ విషయం తేల్చవయ్యా అంటూ ఆయన అభిమానులే నిఖిల్ ని అడుగుతున్నారు అంటే.. స్వయంభు విషయంలో వారు ఎంతగా ఆందోళన పడుతున్నారో అర్ధమవుతుంది. పెద్ద సినిమాలు వాయిదా పడితేనే క్రేజ్ పోతుంది అనుకుంటుంటే..

మీడియం రేంజ్ హీరో వి అయ్యుండి.. సినిమా రెడీ అయినా విడుదల తేదీ ఇవ్వకుండా నాన్చడం కరెక్ట్ కాదేమో అని వారి అభిప్రాయం. నిఖిల్ స్వయంభు ప్రమోషన్స్ మొదలు పెట్టి ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. ఆయనేం చేస్తాడు.. ఆ సినిమా ఓటీటీ డీల్ పూర్తి కాలేదు, కాబట్టే విడుదల తేదీ ఇవ్వట్లేదు.

నిఖిల్ హీరో. ఆయనకు రిలీజ్ డేట్ డేట్ కి ఏం సంబంధం. కానీ ఇక్కడ సినిమా వాయిదాల తో నిఖిల్ క్రేజే కదా తగ్గేది. అదే ఆయన ఫ్యాన్స్ భయం. మరి నిఖిల్ అయినా చొరవ చేసి మేకర్స్ తో మాట్లాడితే ఆ విడుదల తేదీ ఏమైనా కదులుతుంది.. లేదంటే సినిమా ని మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు. 

Uncertainty Surrounding On Swayambhu Release