స్టార్ హీరో ఇంట్లో దొంగతనం

Robbery at Star Hero houseRobbery at Star Hero house


కోలీవుడ్ స్టార్ రవి మోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది, విలువైన నగలు పోయాయి అంటూ ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కొద్ధి నెలలుగా భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చే విషయంలో సఫర్ అవుతూనే.. ప్రియురాలు కేనీషా తో ప్రేమ, బ్రేకప్ మళ్లీ కలిసిపోవడం వంటి విషయాలతో రవి మోహన్ మీడియాలోనే కనిపిస్తున్నారు.

ప్రస్తుతం భార్య ఆర్తి తో విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఆయన సింగర్ కేనీషా తో కలిసి జీవిస్తున్నారు. రీసెంట్ గా కేనీషా ట్రోల్స్, నెగిటివిటి తట్టుకోలేక రవి మోహన్ కి గుడ్ బై చెప్పి అంతలోనే మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు రవి మోహన్ ఇంట్లో చోరీ జరిగింది.

తన ఇంట్లో దొంగలు పడ్డారంటూ, పది లక్షలు విలువ చేసే డైమండ్ నెక్ లెస్ పోయింది అని రవి మోహన్ నీలాంగరై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పినట్టుగా రవి మోహన్ మీడియా కి తెలిపారు. అయితే రవి మోహన్ ఇంట్లో చోరీ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. 

Robbery at Ravi Mohan house