ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu with family at Hyderabad airport today

ఫైనల్ గా మహేష్ కి రిలీఫ్ దొరికింది

Mahesh Babu with family at Hyderabad airport today


వారణాసి షూటింగ్ తో మండే వేసవిలోనూ తలమునకలై ఉన్న సూపర్ స్టార్ మహేష్ కి చిన్న విరామం దొరికింది. ఏ సమ్మర్ కి ఫ్యామిలీతో కలిసి విదేశీ వెకేషన్ కి వెళ్లకుండా లేని మహేష్ బాబు ఈసారి సమ్మర్ ని దర్శకుడు రాజమౌళి అర్పణం చేసారు. ఈ ఏడాది వేసవి తాపం ఎలా ఉందొ అందరూ చూసారు. అయినప్పటికీ రాజమౌళి బ్రేక్ అన్నదే లేకుండా వారణాసి షూటింగ్ చేసారు.

దానితో మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ మిస్ అయ్యారని ఫ్యాన్స్ ఫీలయ్యారు. కానీ ఇప్పుడు వారణాసి షూటింగ్ నుంచి చిన్న విరామం దొరకడంతో సూపర్ స్టార్ మహేష్ ఈరోజు తన పిల్లలు సితార, గౌతమ్, భార్య నమ్రతను తీసుకుని విదేశాలకు ఎగిరిపోయారు. ఈరోజు సూపర్ స్టార్ ఫ్యామిలీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. కానీ వారు ఏ దేశానికీ వెళ్లారో అనేది క్లారిటీ లేదు.

దానితో మహేష్ వెకేషన్ కి వెళుతున్నారని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ దొరికిన ఈ కొద్దిపాటి బ్రేక్ ని ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లిపోయారు. ఇక రాగానే జులై ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ వారణాసి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. రాజమౌళి వీలైనంత త్వరగా వారణాసి షూటింగ్ ఫినిష్ చేసేపనిలో ఉన్నారు. తర్వాత విఎఫెక్స్ వర్క్స్ కి కొద్దినెలల సమయం పడుతుంది, ఆతర్వాత ప్రమోషన్స్, ఏప్రిల్ 7, 2027 సినిమా రిలీజ్.

Mahesh Babu Takes a Break from Varanasi Shoot