ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> That one idea that makes a movie a winner is crucial! – Allani

సినిమాను గెలిపించే `ఒక్క ఐడియా` ముఖ్యం!

That one idea that makes a movie a winner is crucial! – AllaniThat one idea that makes a movie a winner is crucial! – Allani

చిత్ర పరిశ్రమలో అసాధారణ విజయాలు సాధించడానికి వందల కోట్ల భారీ బడ్జెట్ మాత్రమే అవసరం లేదని, కేవలం ఒక బలమైన ఐడియా ఉంటే చాలని ప్రపంచవ్యాప్తంగా పలు చిత్రాలు నిరూపించాయి. ఇటీవల కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రం `అబ్సెషన్` భారతదేశం నుంచే సుమారు 70 కోట్ల రూపాయలు రాబట్టడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల నికర వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది గొప్ప లాభాలిచ్చిన సినిమాల‌ను చూస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తాయి. మరాఠీ చిత్రం ‘సైరాఠ్’ కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో 110 కోట్లు వసూలు చేయగా.. బాలీవుడ్‌లో 22 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘ది లంచ్‌బాక్స్’ గ్లోబల్ ఫెనామినన్‌గా మారి 100 కోట్లకు పైగా సాధించింది. అలాగే 8 కోట్ల బడ్జెట్‌తో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ 104 కోట్లు, కేవలం 60 లక్షలతో తీసిన ‘భేజా ఫ్రై’ ఏకంగా 18 కోట్లు (బడ్జెట్ కంటే 30 రెట్లు ఎక్కువ) వసూలు చేసి రికార్డు సృష్టించాయి. టాలీవుడ్‌లో కూడా డెబ్యూ డైరెక్టర్ వేణు యెల్దండి కేవలం 1.5 నుండి 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘బలగం’ వరల్డ్‌వైడ్‌గా 26 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ అసాధారణ విజయాలన్నీ భారీ ఖర్చులతో కాకుండా, కేవలం దర్శకుడి విజన్ , `ఒక్క ఐడియా` తోనే సాధ్యమయ్యాయి. డబ్బు కంటే ఐడియానే అత్యంత శక్తివంతమైనదని, అదే సినిమా విజయానికి శిఖరం లాంటిదని ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఇదే ఆసక్తికరమైన అంశాన్ని టాలీవుడ్ సీనియర్ దర్శకులు, నిర్మాత అల్లాణి శ్రీధర్ ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమాను నడిపించేది, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది కథలోని సరికొత్త ఆలోచనేనని, మారుతున్న కాలంలో బడ్జెట్ కంటే బలమైన కంటెంట్‌కే ఎక్కువ శక్తి ఉంటుందని ఆయన తన అనుభవాల ద్వారా విశ్లేషించారు.

Movies