Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Lokesh Son Devansh Youtube Channel Launch

నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్

Nara Lokesh Son Devansh Youtube Channel Launch

ఆటల్లో ఎప్పుడు ముందుంటూ చాలా ఎనర్జీతో కనిపించే ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. నారా దేవాన్ష్ Dino Deets పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ మొదలుపెట్టారు. ఈ సంద‌ర్భంగా నారా-నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. Dino Deets టీజ‌ర్‌లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని దేవాన్ష్ యూట్యూబ్‌, పాడ్ కాస్ట్ ప్ర‌త్యేక‌తలు తెలుసుకున్నారు.

డైనోసార్లు,  శిలాజాలు (fossils), పురాత‌న అవ‌శేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింత‌లు-విశేషాలు ఆక‌ట్టుకునే శైలిలో, న‌వ్విస్తూ, ఆలోచింప‌జేసేలా  దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా వీక్ష‌కుల‌కు చేర‌నున్నాయి. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్ష‌కుడిలా ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఉద్విగ్నంగా త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ నారా దేవాన్ష్‌ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు.  ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్‌ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.

Devansh