Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anasuya Enjoys A Vacation With Her Family

కొడుకులతో అనసూయ జలకాలాట

Anasuya Enjoys A Vacation With Her Family

స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ప్రొఫెషనల్ గా చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. నటిగా ఎంత బిజీగా అయినా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే అనసూయ తన బర్త్ డే కి కొడుకులు, భర్త తో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోయింది.

రెండు రోజుల క్రితమే బర్త్ డే ని ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ గా చేసుకున్న అనసూయ అఫీషియల్ గా 41 లోకి అడుగుపెట్టింది. వయసు అనేది జస్ట్ ఏజ్ మాత్రమే అని అనసూయ ఎప్పటికప్పుడు నిరూపిస్తుంది. మీడియా ముందు అయినా, వెండితెరపై అయినా, లేదంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినా అనసూయ అందాలు ఆరబోసే డ్రెస్సులతో ఈ వయసులోనూ హాట్ గా కనిపించేందుకు తహతహలాడుతోంది.

తాజాగా అనసూయ స్విమ్ సూట్ లో కొడుకులు, భర్త తో జలకాలాడుతున్న ఫొటోస్ ని తన బర్త్ డే సందర్భంగా షేర్ చేసింది. కేక్ కట్ చేస్తూ, అలాగే స్విమ్ చేస్తున్న పిక్స్ అవి. అది చూసే ఈ ఏజ్ లోను అనసూయ ఎక్కడా తగ్గట్లేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya