ఆంధ్రలో మరికొద్ది గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరు గెలుస్తారు అనే విషయంలో ప్రజల్లో ఒక క్లారిటీ వుంది. సంక్షేమ పథకాలతో ప్రజలకి అండగా నిలిచిన జగన్ గెలుస్తాడని అందరూ నమ్ముతున్నారు. గతంలో పథకాలు ప్రకటించి వాటిని అమలు చెయ్యకుండా 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చంద్రబాబు ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగాలేరు, మరోమారు ఈ ఎన్నికల్లో చంద్రాబాబుకి భంగపాటు తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇంతలోపులో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో టేపు బయటికి రావడం కలకలం సృష్టించింది. చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతూ.. రెండు నెలల్లో పోలింగ్ ఉంది, ఎలక్షన్ లో ఎలాగైనా గెలుస్తాం, ఏం చేసైనా గెలుస్తాం, అమరావతిని డెవెలప్ చేస్తామంటూ హామీలు ఇస్తున్న చంద్రబాబు గొంతు విన్న ప్రతి ఒక్కరూ..
ప్రజలకి ఇకపై పథకాల్లేవ్ ఏం లేవ్, మొత్తం అమరావతికి కుమ్మరిస్థాం , అమరావతి డెవలప్ చెయ్యడమే నా ద్యేయం, మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయ్, త్వరలో మీకు లాభాలు చూపిస్తా అని చెబుతున్నాడు, ఇది విన్నాక కూడా ప్రజలు చంద్రాబబుకి ఓటేసి గెలిపించే చాన్సు ఉందా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.