పాన్ ఇండియా మోజులో కంటెంట్ వదిలేసారు!
In the craze for pan-India appeal, they’ve abandoned the content!
బాహుబలి పాన్ ఇండియా మూవీగా పలు భాషల ప్రేక్షకులకు చేరువైన టాలీవుడ్ సినిమా.. ఆతర్వాత పాన్ ఇండియా మోజులో పడి కంటెంట్ ను విమరిస్తున్నారు హీరోలు. యాక్షన్ యాక్షన్ అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులను ఎలాగైనా ఇంప్రెస్ చేసేస్తామనే ఊహలతో భారీ బడ్జెట్ పెట్టి మరీ పాన్ ఇండియా మార్కెట్ లోకి దిగుతున్నారు.
యాక్షన్ తో వచ్చిన ఎక్కడో ఒక సినిమా హిట్ అయ్యింది అని అదే కోవలో కథలు వదిలేసి, యాక్షన్ ని ప్రధానంగా తీసుకుని ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్ తో పని లేదు అని మలయాళ సినిమాలు ఎప్పటికపుడు నిరూపిస్తూనే ఉన్నాయి. కానీ టాలీవుడ్ హీరోలు కంటెంట్ ని వదిలేసి యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు పాన్ ఇండియా పాన్ ఇండియా. ఇదే మోజులో హీరోలు కొట్టుకుపోతున్నారు. స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా మోజులో కంటెంట్ ను వదిలేస్తున్నారు. సింపుల్ కథ తీసుకుని పాన్ ఇండియా సినిమా అంటూ బొక్క బోర్లా పడుతున్నారు. కథ ఉండదు అయినా పాన్ ఇండియా మోజు ఇదే ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం. మరి హీరోలు అదెప్పుడు తెలుసుకుంటారో చూడాలి.
















































