బిగ్ బాస్: ఎప్పుడో చెయ్యాల్సింది ఇప్పుడు చేసారు
Bigg Boss Telugu Leaks create buzzబిగ్ బాస్ గత కొన్ని సీజన్స్ నుంచి కాదు కాదు సెకండ్ సీజన్ నుంచే లీకులు బిగ్ బాస్ యాజమాన్యానికి తలనెప్పులు తెచ్చిపెట్టాయి. మొదటి సీజన్ పూణే లో జరిగింది, కాబట్టి లీకులు రాలేదు. కానీ అన్నపూర్ణ స్టూడియో లో ఎప్పుడైతే సెట్ వేసి బిగ్ బాస్ మొదలెట్టారో అప్పటినుంచి లీకులు యాజమాన్యానికి చిరాకు తెప్పిస్తున్నాయి.
అయితే ఆ లీకుల వలన స్టార్ మా కి టిఆర్పి కూడా తగ్గింది అనే చెప్పాలి. అయితే ఈ సీజన్ లో కామనర్ రోహిత్ ఎలిమిషన్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. రోహిత్ అభిమానులు స్టార్ మా ని, బిగ్ బాస్ ని విపరీతంగా తిట్టారు. అసలు రోహిత్ అఫీషియల్ ఎలిమినేషన్ లో బయటకు రాకముందే రోహిత్ ఎలిమినేట్ అయిన విషయం లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అందుకేనేమో ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు అంటే బిగ్ బాస్ రివ్యూయర్స్ బిగ్ బాస్ కి పని చేసే టెక్నీకల్ టీమ్ కి డబ్బులిచ్చి లీకులు అందుకుని రివ్యూస్ చెప్పుకుంటున్నారు. అలాంటి వారికి బిగ్ బాస్ యాజమాన్యం ఉద్యాగాలు తీసేస్తామని బెదిరించడంతోనే ఈవారం లీకులు బయటకు రాలేదు అంటున్నారు.
లేదంటే గత రాత్రి ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనే విషయం ఈపాటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. మరి ఇదేదో ఎప్పుడో చేసి ఉంటె బిగ్ బాస్ యజన్యానికి ఇంత తలనొప్పి ఉండేది కాదు.
















































