భార్య ని కాదని త్రిష తో విజయ్
Vijay, Trisha attend wedding reception in Chennai
విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇవ్వబోతుంది అనే న్యూస్ ఈ ఏడాది తమిళనాట సంచలనం సృష్టించింది. సంగీత మళ్లీ విజయ్ తో కాంప్రమైజ్ అవుతూ.. విడాకుల కేసు వెనక్కి తీసుకుంది. అయితే విజయ్ నటి త్రిష తో క్లోజ్ గా ఉంటున్నారనే విషయంలోనే సంగీత విజయ్ కు విడాకులు ఇస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే.
త్రిష కూడా విజయ్ సీఎం అయినదగ్గరనుంచి ఏ విషయంలో అయినా విజయ్ పక్కనే నిలబడుతుంది. అధికారిక విషయం అయినా, పర్సనల్ విషయమైనా, అజిత్ కార్ రేసింగ్ కోసం లండన్ వెళ్లినా, అజిత్ తల్లి చనిపోయినా త్రిష-విజయ్ కలిసే వెళ్లారు. సంగీత విజయ్ తో కాంప్రమైజ్ అయినా విజయ్ మాత్రం త్రిషను వదలడం లేదు.
దానికి మరో ఉదాహరణ గత రాత్రి చెన్నై లో జరిగిన ఓ వివాహం. ఆ వివాహానికి తమిళనాడు సీఎం హోదాలో విజయ్ వెళ్లగా.. త్రిష ఆయన పక్కనే ఉండడం అందరిని మరోసారి విస్మయానికి గురి చేసింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో వైఎస్ అనీల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం జరిగింది. ఆ వివాహానికి విజయ్ తో కలిసి త్రిష వచ్చింది.
ఈ వేడుకలో భార్య సంగీత తో కనిపించాల్సిన విజయ్ ఆమెను వదిలేసి త్రిష తో కనిపించారు. ఈ వేడుకకు ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
















































