సూర్య సీన్ ఓవర్సీస్ టాక్

Scene Overseas TalkScene Overseas Talk


ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో క్రేజీ గా మారిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టాలని మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య-నస్లీన్ కలయికలో రూపొందిన సీన్ చిత్రం నేడు నవంబర్ 06 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఇప్పటికే సీన్ ఓవర్సీస్ షోస్, ఎర్లీ షోస్ పూర్తి కావడంతో ఆడియన్స్ సీన్ చిత్రం పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సూర్య సీన్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే... సీన్ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్, సూర్య స్క్రీన్ ప్లే, నస్లీన్ సైకోయిజం ఫస్ట్ హాఫ్ లో హైలెట్. ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్ అంటూ ఆడియన్స్ ట్వీట్లు పెట్టారు.

సూర్య ఇన్బరాజ్ కేరెక్టర్ లో చెలరేగిపోయారు, నస్లీన్ సైకో కేరెక్టరైజేషన్ సెకండ్ హాఫ్ లోను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఈ చిత్రం మొత్తం క్రైమ్, కామెడీ, మర్డర్ చుట్టూ తిరుగుతుంది, BGM అయితే నెక్స్ట్ లెవల్, జీతూ మాధవన్ దర్శకత్వం అదుర్స్ అంటూ ఆడియన్స్ ట్వీట్లు పెడుతున్నారు.

ఇప్పటివరకు సీన్ చిత్రాన్ని వీక్షించిన వారు సినిమా బావుంది అంటూ స్పందిస్తున్నారు. మరి సీన్ ఎలా ఉందొ అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో.. 

Suriya Scene Social Media Talk