దీపావళికి దాదా బ్లాస్టింగ్ అప్డేట్
Dada's Blast On Diwali
డిసెంబర్ 24 అంటే మరో రెండు నెలల సమయం కూడా లేదు. అందుకే డిసెంబర్ 24 క్రిస్టమస్ కి విడుదల కాబోతున్న చిత్రాల ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ ప్రిపేర్ అవుతున్నారు. డిసెంబర్ 24 న రాబోతున్న షారుఖ్ కింగ్ నుంచి ఈరోజు షారుక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వదిలారు. ఇక నాగార్జున #King100 నుంచి టబు గ్లింప్స్ ని రెడీ చేస్తున్నారు. టబు బర్త్ డే కి ఆ గ్లింప్స్ వదలబోతున్నారు.
ఇక ఈ దివాళీ కి బాలయ్య దాదా నుంచి బ్లాస్టింగ్ అప్ డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న దాదా చిత్రం డిసెంబర్ 24 కి రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుగుతుంది. బాలయ్య-మంచు మనోజ్ ల పై హెవీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు.
అయితే ఈ చిత్రం నుంచి దివాళి కి ట్రీట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. దీపావళి దగ్గర నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని.. పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ప్రమోషన్స్ ని మేకర్స్ పారలల్ గా మొదలు పెట్టబోతున్నారని.. దివాళీ కి మాత్రం దాదా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ అంటున్నారు. చూద్దాం ఆ బ్లాస్టింగ్ అప్ డేట్ ఏమిటి అనేది.
















































