ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Fans demand Rohit's re-entry

బిగ్ బాస్: రోహిత్ రీ-ఎంట్రీ కోసం ఫ్యాన్స్ డిమాండ్

Bigg Boss 10: Fans demand Rohit's re-entryBigg Boss 10: Fans demand Rohit's re-entry

 

బిగ్ బాస్ సీజన్ 10 లో ట్రోఫీ గెలిచే పొటెన్షియాలిటీ ఉన్న కేండేట్ కామనర్ రోహిత్. అగ్నిపరీక్ష నుంచే పవర్ ఫుల్ ఫ్యాన్స్ బేస్ ని ఏర్పాటు చేసుకుని హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ నాయుడు.. మొదటి రెండు వారాల్లో రోహిత్ బిగ్ బాస్ ట్రోఫీ కొడతాడు, లేదంటే టాప్ 2 లో ఉంటాడు అనుకున్నారు.

కానీ షాలిని వల్ల అలాగే నోటి దూల వల్ల ఎనిమిదో వారంలోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఓట్స్ తో ఎలిమినేట్ అయ్యి వచ్చేసాడు. అయితే రోహిత్ హౌస్ లో ఎలా ఉన్నా అంటే ఆడినా ఆడకపోయినా, శాలిని తో తిరిగినా, మాట తూలినా రోహిత్ ఫ్యాన్స్ ఆయన్ని వెర్రిగానే అభిమానించారు. కామనర్స్ కి అన్యాయం జరిగిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఏడ్చేవారు.

ఇక రోహిత్ ఎనిమిదో వారం ఎలిమినేట్ అవడంతో ఆయనకు సీక్రెట్ రూమ్ ఆఫర్ వచ్చినా ఒప్పుకోలేదు, అమ్మ నచ్చజెప్పినా ఒప్పుకోలేదు, ఆత్మాభిమానం చంపుకోలేదు అంటూ ఏవేవో కథలు అల్లుకుని కూల్ అయిన రోహిత్ ఫ్యాన్స్ ఇప్పుడు రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ గోల గోల చెయ్యడమే కాదు..

రోహిత్ ని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించాలని, ఈ వీకెండ్ కల్లా రోహిత్ హౌస్ లో ఉండేలా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు రోహిత్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చ చేద్దామనుకుని ఆగారు వారు. లీగల్ ఇష్యుస్ వస్తాయని భయపడ్డారు. మరి రోహిత్ ఫ్యాన్స్ డిమాండ్ నెరవేరుతుందేమో చూడాలి.

Rohit re entry into Bigg Boss Telugu 10