మీడియాపై నెపం నెట్టేస్తున్న నందన

Rama Nanda Fires on MediaRama Nanda Fires on Media


యుకె లో వీసాల పేరు తో మోసం చేసిన కేసులో నందూస్ వరల్డ్ ఫేమ్ మధుకర్, నందన అలాగే మధుకర్ తండ్రిపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. దానితో ఈ దంపతులు విదేశాలకు పారిపోకుండా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు. అయితే బిగ్ బాస్ సీజన్ 10 లో ఆఫర్ రావడంతో నందన ఇండియాకి వచ్చినట్లుగా తెలుస్తుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు నందు ని అదుపులోకి తీసుకుని ఏపీలోని ఇబ్రహీం పట్నం పోలీసులకు అప్పజెప్పారు. నిన్న మంగళవారం ఆమె పోలిసుల ఎదుట విచారణకు హాజరైంది. తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చిన నందన మీడియా వారిపై ఫైర్ అయ్యింది. ఆమె విచారణ ముగిసి బయటికి వస్తున్న సమయంలో మీడియా వారు ప్రశ్నించగా..

తామేమి తప్పు చెయ్యలేదు అని, మొత్తం మీడియానే చేసింది అంటూ నెపం మొత్తం మీడియాపై నెట్టెయ్యడం గమనార్హం. అంతేకాకుండా పోలీసుల తోనూ నందన ఆ వీసాలన్నీ తన భర్త మధుకర్ చూసుకున్నాడని, తన బిజినెస్ వేరే అని చెప్పినట్లుగా తెలుస్తుంది. తాను తప్పు చెయ్యలేదు అంటూ ఈ కేసులు బయటికొచ్చినప్పటి నుంచే నందన వీడియోస్ చేస్తూ గోడు వెళ్లబోసుకుంటుంది. 

Nandu's World Nanda Fires on Media