ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun Emerges As Highest Paid Actor

అల్లు అర్జున్ ని టచ్ చేయడం కష్టమే!

Allu Arjun Emerges As Highest Paid ActorAllu Arjun Emerges As Highest Paid Actor


పాన్ ఇండియా స్టార్స్ లో సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ మార్కెట్ పెరిగింది. బాహుబలి క్రేజ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 తో పాన్ ఇండియా మర్కెట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్ ని పెంచుకున్నారు. పుష్ప చిత్రంతో వచ్చిన ఫేమ్ ని అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు.

అందుకే అట్లీ తో చేస్తున్న రాకా చిత్రాన్ని అందరి కంట్లో పడేలా ముంబై వేదికగా చిత్రీకరణ చేస్తున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్, ముంబై అంటూ తిరుగుతూ తెగ హైలెట్ అవుతున్నారు. ఎప్పుడు బాలీవుడ్ మీడియాలో మెదులుతూ ఉండేలా చూసుకుంటున్నారు. ఇకపోతే పుష్ప అప్పుడే బిజినెస్ లో వాటా తీసుకున్న అల్లు అర్జున్ అదే ఫార్ములా ను అట్లీ రకా కి కూడా అప్లై చేస్తున్నారని తెలుస్తుంది.

రాకా కోసం పారితోషికమే కాదు.. ఈ సినిమాకి కూడా బిజినెస్ లో 33 శాతం అల్లు అర్జున్ వాటా తీసుకోబోతున్నారట. మరి ప్రస్తుతం రాకా పై పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న అంచనాల ప్రకారమైతే.. పారితోషికం అలాగే బిజినెస్ వాటా కలిపి అల్లు అర్జున్ కి దాదాపుగా రూ.300 కోట్లు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది తెలుస్తుంది.

మరి ఒక్క సినిమాకే ఈ రేంజ్ రాబడి అంటే.. అల్లు అర్జున్ ని టచ్ చెయ్యడం ప్రస్తుతం హీరోలకు ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు అంటూ అల్లు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Allu Arjun's remuneration for Raaka is reportedly linked to profits