ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kangana Ranaut wishes Gen Z Happy Friendship Day

జెన్ - జీ కి మ‌రో షాక్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్!

Kangana Ranaut wishes Gen Z Happy Friendship DayKangana Ranaut wishes Gen Z Happy Friendship Day

బాలీవుడ్  నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి  వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో నేటి యువతపై( జెన్ జీ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కంగ‌న  తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జెన్-జీ తరానికి  శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా కంగ‌న చేసిన పోస్ట్  నెట్టింట వైరల్‌గా మారింది.

కొద్ది రోజుల క్రితం యువత జీవనశైలిని ఉద్దేశిస్తూ కంగనా రనౌత్ వారిని జనరేషన్ గట్టర్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఆధునిక పోకడలు, ఆలోచనా విధానంపై కంగ‌న  చేసిన  వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే ఆ విమర్శలు చేసిన కొద్ది రోజులకే కంగ‌న స్వయంగా ముందుకు వచ్చి ఫ్రెండ్‌షిప్ డే విషెస్ చెప్పడం  ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కంగ‌న చేసిన విమర్శలకు, నేటి శుభాకాంక్షలకు మధ్య ఉన్న వైవిధ్యాన్ని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు తీవ్రమైన విమర్శలు చేయడం, మరోవైపు ఇలా పండగ రోజు శుభాకాంక్షలు చెప్పడం కంగనాకే చెల్లిందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కంగ‌న ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా మారుతుండటం విశేషం.

Kangana Ranaut