మహేష్ ఫ్యాన్స్ కౌన్ డౌన్ స్టార్ట్

Mahesh fans' countdown beginsMahesh fans' countdown begins


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కౌన్ డౌన్ స్టార్ట్ చేసేసారు. మహేష్ బాబు నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ వారణాసి నుంచి మహేష్ బర్త్ డే కి ఎలాంటి ట్రీట్ ని దర్శకధీరుడు రాజమౌళి సిద్ధం చేసారో, అది కేవలం పోస్టర్ కాకుండా, గ్లింప్స్ వదలాలని వారి కోరిక.

మరి రాజమౌళి గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే ఆగష్టు 9 న ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసారు. కానీ ఈ ఏడాది మహేష్ ఫ్యాన్స్ కే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వారణాసి నుంచి స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. కానీ ఆ విషయమై క్లారిటీ లేదు.

మహేష్ ఫ్యాన్స్ రోజులు, గంటలు లేక్కేట్టేసుకుంటున్నారు. వారణాసి నుంచి సూపర్ స్టార్ మహేష్ కి సంబంధించిన ఏ ట్రీట్ వచ్చినా ఫ్యాన్స్ కి సంతోషమే. అది గ్లింప్స్ అయితే ఆ హ్యాపినెస్ డబుల్ అవుతుంది. మరి రాజమౌళి ఫ్యాన్స్ ని ఎలాంటి ట్రీట్ ఇస్తారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.

The Superstar month is finally here