బ్రేకప్ వార్తలపై ఓపెన్ అయిన అనుపమ

Anupama parameswaran on her breakupAnupama parameswaran on her breakup

 

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొద్దిరోజులుగా కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్ తో డేటింగ్ చేస్తుంది. త్వరలోనే ఆమె ధృవ్ విక్రమ్ ని వివాహమాడనుంది అనే వార్తలు వినిపించడమే కాదు.. ఈమధ్యన అనుపమ తో ధృవ్ విక్రమ్ బ్రేకప్ చేసుకున్నాడనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ ఈవెంట్ కి హాజరైన సందర్భంలో ఆమె లవ్, బ్రేకప్ వార్తలపై ఇండైరెక్ట్ గా ఓపెన్ అయ్యింది. గత ఏడాది తన లైఫ్ లో అత్యంత సంక్లిష్టమైన ఫేజ్ అని, ఆ ఏడాది తనకు కష్టతరమైన ఘట్టంగా నడిచింది. ఆ కష్టాలను దాటుకుని, ఇప్పుడు మళ్లీ తన లైఫ్ లో సంతోషం, ప్రశాంతత వైపు అడుగులు వేస్తున్నాను అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.

మరి ధృవ్ విక్రమ్ తో ప్రేమ, బ్రేకప్ వార్తల నేపథ్యంలో అనుపమ చేసిన ఈ కీలక వ్యాఖ్యలు బ్రేకప్ కి సంబంధించినవే, ఆమె డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇలా ఓపెన్ అయ్యింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
 

Anupama parameswaran On Her Personal Life