రెండో రోజే పడుకున్న మంగాపురం వసూళ్లు
Srinivasa Mangapuram collections
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రమేష్ కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన శ్రీనివాస మంగాపురం చిత్రం గత గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. ఆడియన్స్, క్రిటిక్స్ మంగాపురాన్ని ప్లాప్ లిస్ట్ లో వేసేసారు.
కొత్త కుర్రాడు జయకృష్ణ బాగానే చేసినా.. అజయ్ భూపతి ఓల్డ్ స్టోరీ తో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు, జెన్ జీల కాలంలో పాత చింతకాయపచ్చడి లాంటి కథలను చూసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది అని తేల్చేసారు. మొదటి రోజే మంగాపురానికి స్పైడర్ మ్యాన్ దెబ్బ గట్టిగా పడింది.
ఇక శ్రీనివాస మంగాపురానికి వచ్చిన టాక్ తో రెండో రోజుకే వసూళ్లు పడిపోయాయి. అందులోను వర్కింగ్ డేస్, నెగెటివ్ టాక్ తో సినిమా గట్టెక్కడం మాములు విషయం కాదు ఈ రోజుల్లో.
Srinivasa Mangapuram movie








































